రాష్ట్రంలో పులకేశి పాలన: Buddha Venkanna

by srinivas |   ( Updated:2022-12-09 15:18:20.0  )
రాష్ట్రంలో పులకేశి పాలన: Buddha Venkanna
X
  • వైసీపీ అనే శని పోయేంత వరకు ప్రజలు కష్టాలు పడాల్సిందే
  • ఉత్తరాంధ్ర టీడీపీ జోనల్ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న

దిశ, డైనమిక్ బ్యూరో : మూడున్నరేళ్లుగా రాష్ట్రానికి శని పట్టిందని.. ఆ శనిపోయేంత వరకు ప్రజలు కష్టాలు పడక తప్పదని ఉత్తరాంధ్ర టీడీపీ జోనల్ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న అన్నారు. రాష్ట్రంలో పులకేశి పాలన కొనసాగుతుందంటూ ఆయన ధ్వజమెత్తారు. 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా బుద్ధా వెంకన్న శుక్రవారం విజయనగరంలో పర్యటించారు. 46వ డివిజన్‌లో టీడీపీ నేతలతో కలిసి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి బుద్ధా వెంకన్న పూలమాలలు వేసి నివాళు అర్పించారు. అనంతరం డివిజన్‌లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, మండల అధ్యక్షులు బొద్దుల నర్సింగరావు, కనకల మురళీమోహన్‌ ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story