APP: అది చట్ట విరుద్ధం..!

by srinivas |
APP: అది చట్ట విరుద్ధం..!
X

దిశ, అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్టర్ ఆఫీసుల్లో జరిగే రిజిస్ట్రేషన్లు సచివాలయానికి మార్చడం చట్ట విరుద్ధమని అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కొణతాల హరినాథ్ అన్నారు. ప్రజలు లక్షలాది రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి తమ ఆస్తులకు రక్షణగా ఉంటుందన్న ఉద్దేశంతో రిజిస్టర్ కార్యాలయాలు ప్రభుత్వం ద్వారా నడపబడతాయన్నారు. కాబట్టి ప్రజల ఆస్తికి పూర్తి భద్రత ఉంటుందని నమ్మకంతో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని తెలిపారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలను ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చిన తరువాత రిజిస్ట్రేషన్ ప్రక్రియను మార్చాలని డిమాండ్ చేశారు. సరైన విధానాలు లేకుండానే సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రారంభించడం పట్ల ప్రజలకు అనుమానాలు రేతుక్కుతున్నాయని ఆరోపించారు. సచివాలయ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగులుగా ముందు ప్రకటించిన తరువాత సచివాలయాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రజలు ఆహ్వానిస్తారని చెప్పారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నమ్మకం కలిగే విధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు చట్టబద్ధం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కొణతాల హరినాథ్ బాబు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story