దుర్భరంగా కస్తూరిభా వసతి గృహం విద్యార్ధినుల పరిస్థితులు

by srinivas |
దుర్భరంగా కస్తూరిభా వసతి గృహం విద్యార్ధినుల పరిస్థితులు
X

దిశ, ఉత్తరాంధ్ర: అనకాపల్లి జిల్లాలో ఎస్. రాయవరం మండలం లింగరాజు పాలెం కస్తూరిభా వసతి గృహం విద్యార్ధినుల పరిస్థితి దుర్భరంగా ఉంది. కనీస వసతులు లేకపోవడంతో దయనీయ పరిస్థితి నెలకొంది. సాధారణంగా ప్రభుత్వ వసతి గృహాల్లో కొద్దిపాటి లోపాలు ఉన్నా విద్యార్ధులు సర్దుకుపోతుంటారు. కాని ఇక్కడి వసతి గృహం పరిస్థితి మరీ దారుణంగా ఉందని విద్యార్ధినులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్నానపు గదులు లేక తమ వద్ద ఉన్న దుప్పట్లు అడ్డుగా తాళ్లతో కట్టుకొని వసతి గృహం లైట్లు ఆఫ్ చేసి స్నానాలు ఆచరిస్తున్నారు. ఇలాంటి దారుణ పరిస్థితులు ఇక్కడ ఉన్నా ఏ అధికారికి, ప్రజాప్రతినిధికి తెలియదంటే ఎంతమాత్రం సమంజసం కాదు. మరోక విషయం ఏమిటంటే తాము పరీక్షల్లో పాస్ అవుతామనే నమ్మకం కూడా లేదని వాపోతున్నారు. టీచర్లు తమకు ఏమి చెప్పడం లేదని, తల్లిదండ్రుల కలలు నెరవేర్చలేమని భోరున విలపిస్తున్నారు. అయితే ఇదేదో మారుమూల పల్లె ప్రాంతం కాదు. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నియోజకవర్గంలో ఓ ప్రాంతమిది. బీసీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినుల కన్నీటి గాధ. మరి ఇలాంటి దుస్థితి ఇక్కడ కనిపిస్తుంటే అధికారులు, ప్రజాప్రతినిదులు ధర్జాగా తలెత్తుకొని ఎలా తిరుగుతున్నారో.. వారికే తెలియాలి. ఇప్పటికైనా కస్తూర్బా వాస్తు గృహం లో సదుపాయాలు ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed