ప్రబలిన అతిసారం.. ఇద్దరు మృతి

by Rani Yarlagadda |
ప్రబలిన అతిసారం.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామంలో అతిసారం (Diarrhea) వ్యాధి ప్రబలింది. గ్రామంలో ఇప్పటి వరకూ 34 మంది ఈ వ్యాధి బారిన పడగా.. ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం విజయనగరం, సాలూరు ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్యులు 9 మందికి చికిత్స అందిస్తున్నారు. మరో 26 మందికి గ్రామంలోనే ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నారు.

అతిసార వ్యాధి ఎక్కువగా పిల్లలకు వస్తుంది రోటా అనే వైరస్ ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. రోజుకు మూడు కంటే ఎక్కువసార్లు నీళ్ల విరేచనాలు, వాంతులు, లో ఫీవర్, రక్త విరేచనాలు, వికారం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే అతిసార వ్యాధి కావచ్చని వైద్యులు చెబుతున్నారు. మల, మూత్ర విసర్జనల తర్వాత, అన్నం తినేముందు చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం, కాచి, చల్లార్చిన నీటిని తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి రాకుండా ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed