AP Politics:ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యత..కాపులకు వైసీపీ పెద్దపీట వేసింది: వైసీపీ అభ్యర్థి

by Jakkula Mamatha |
AP Politics:ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యత..కాపులకు వైసీపీ పెద్దపీట వేసింది: వైసీపీ అభ్యర్థి
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి చెప్పారు. కాపులను వైసీపీ ప్రభుత్వం గుర్తించిందని, వారికి పెద్దపేట వేసిందని అన్నారు. ఆదివారం గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో జరిగిన కాపు, తెలగ, బలిజ కులాల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని కులాలకు సమాన ప్రాతిపదికన సంక్షేమ పథకాలు అందిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన అందించారని అన్నారు. అన్ని కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఆయా కులాలకు ప్రత్యేక బడ్జెట్ రూపొందించి వారి అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారని చెప్పారు.

ప్రజా సంక్షేమానికి సంబంధించిన మేనిఫెస్టో అంశాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని, వీటిని ఓటర్లకు వివరిస్తూ ఓటును అభ్యర్థించాలని సూచించారు. వైసీపీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందని హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, విశాఖ ఎంపీ అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నియోజవర్గం లో ఉన్న కాపు తెలగ, బలిజ కులస్తులు సమస్యల పరిష్కారానికి ఎప్పుడు ముందుంటామని, పిలిస్తే పలుకుతామని అడారి హామీ ఇచ్చారు.

నియోజకవర్గం ఇప్పటికే 255 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు గుర్తు చేశారు. అలాగే బడుగు బలహీన వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలు అందించినట్లు వివరించారు. సొంత నిధులతో పెన్షన్లు విద్య, వైద్యానికి సంబంధించిన ఆర్థిక సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారు. మంచికి చెడుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో వైసీపీ విజయానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎన్నికల సహా పరిశీలకులు పేడాడ రమణకుమారి, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీలకు పెద్దపీట

మైనారిటీ వర్గాల అభ్యున్నతికి వైసీపీ ప్రభుత్వం ఆవిరిలళ కృషి చేస్తుందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ చెప్పారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పలు చర్చలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా చర్చ్‌లు ఫాస్టర్లు ఆనంద్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మైనార్టీ వర్గాల సమస్యలన్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మైనార్టీ వర్గాలందరూ వైసీపీకి మద్దతు తెలపాలని ఆకాంక్షించారు. గత 19 నెలలుగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రస్తావించిన ఆయన, నియోజకవర్గంలోని నిరుపేదలకు సొంత నిధులతో పెన్షన్, విద్య, వైద్యానికి సంబంధించిన నిధులు సహకారం అందించినట్లు గుర్తు చేశారు. ఎటువంటి పదవులు లేకుండానే ఇంత అభివృద్ధి చేసిన తనను ఎమ్మెల్యేగా విజయాన్ని చేకూరిస్తే మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story