- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Politics:మధ్యతరగతి ప్రజల కోసం ప్రత్యేక హౌసింగ్ స్కీమ్ తీసుకువస్తాం:టీడీపీ అభ్యర్థి
దిశ ప్రతినిధి,విశాఖపట్నం:మధ్య తరగతి ప్రజల సొంతింటి కల సాకారం చేసేలా ప్రత్యేక హౌసింగ్ పాలసీని కూటమి ప్రభుత్వం తీసుకువస్తుందని గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ అన్నారు. గాజువాక గ్రీన్ సిటీలో కూటమి ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌తో కలిసి ఫార్మా మరియు అనుభంద రంగాలకు చేందిన ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్బంగా ఉద్యోగులు తమ సమస్యలను కూటమి అభ్యర్థుల దృష్టికి తీసుకువచ్చారు. ఫార్మా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు జీతాలు తక్కువగా ఉంటున్నాయని ఎక్కువ మధ్యతరగతి ప్రజలు ఫార్మా రంగంలో పనిచేస్తున్నారని ఉద్యోగులు భరత్,శ్రీనివాస్ లకు వివరించారు.
ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాలైన గాజువాక నుంచి లంకెలపాలెం వరకు ట్రాఫిక్ సమస్య వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. దీనిపై స్పందించిన భరత్ నిపుణుల కొరత ఫార్మా రంగంలో ఇతర రంగాలతో పోలిస్తే తక్కువగా జీతాలు వస్తున్నాయన్నారు. దీనిపై ఫార్మా యాజమాన్యాలు చోరవ చూపించాల్సి ఉంటుందన్నారు. దీనితో పాటు మధ్యతరగతి ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక పాలసీ తీసుకువచ్చేందుకు కృషి చేస్తోందన్నారు. ఇప్పుడు వేల మంది ఉద్యోగులు ఫార్మా రంగంలో పని చేస్తున్నారన్నారు. తిరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఫార్మా ఉద్యోగేలు టీం వర్క్‌గా వైసీపీ ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత కోనతాతారావు, ఫార్మా కంపెనీ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.