ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు వాలంటీర్లు.. రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె.రాజు

by Javid Pasha |
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు వాలంటీర్లు.. రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె.రాజు
X

దిశ, ఉత్తరాంధ్ర: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు వాలంటీర్లు అని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కెకె రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 46వార్డు శాంతి నగర్ కమ్యూనిటీ హాల్లో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ ఆధ్వర్యంలో 46వార్డుకు సంబం ధించిన వాలంటరీలకు సేవామిత్ర సేవారత్న, సేవా వజ్ర పురస్కారాల ప్రదానోత్సవం చేశారు. ఈ కార్య క్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కెకె రాజు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా సేవా మిత్ర, సేవారత్న, సేవా వజ్ర ఎంపికైన వాలంటీర్లను శాలువాతో సత్కరించి అవార్డు ప్రదానం చేసి సర్టిఫికెట్లను అంద జేశారు.

అనంతరం కెకె రాజు మాట్లాడుతూ.. నిరుపేదలకు తక్షణ సహాయం అందే విధంగా, ప్రభుత్వ పథకాలు ప్రజలు ముంగిట చేరే విధంగా సీఎం జగన్ వార్డు వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారని అన్నారు. ఈ వార్డు వాలంటీరి వ్యవస్థ ద్వారా రోజుల వ్యవధిలోనే పలు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్ రాజు, జోన్-5 ఏపీడీ శైలజ, బి.గోవింద్, కె.చిన్నా నరసింగరావు, కె.రామారావు, యస్.రామారావు, జి.అప్పారావు, అప్పలరెడ్డి, తారకేసు, వరలక్ష్మీ, వి.శ్రీను, శ్రీను, రెడ్డి, కృపా, సచివాలయం కన్వీనర్లు, సిబ్బంది, ఆర్.పి లు, వాలంటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed