Kidnap Incident: పవన్ కల్యాణ్ చాలా బెటర్.. ఎంపీ సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-06-21 11:22:15.0  )
Kidnap Incident: పవన్ కల్యాణ్ చాలా బెటర్..  ఎంపీ సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, ఉత్తరాంధ్ర: తన భార్యను 30 గంటలు, తన కుమారుడుని 50 గంటలపాటు కిడ్నాపైనప్పటికి చివరి నిమిషం వరకు తనకు సమాచారం లేదని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బయట ప్రపంచం తెలియని వారికి కిడ్నాపర్ నకరం చూపించాడని తెలిపారు. చావు వరకు తీసుకెళ్లిన అగంతకుడి గురించి ఎవరూ మాట్లాడకపోగా, తనపై తన కుటుంబంపై ఏవేవో మాట్లాడుతుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తన స్నేహితుడు జీవీ సహితం చావు వరకు వెళ్లేంతగా కిడ్నాపర్ బాధించారన్నారు. తాను అందరిలాగే మనిషినేనని, సమాజంలో ఎంపీ అంటే అతీతమేం కాదన్నారు. ఒళ్లంతా దెబ్బలతో అడవిలో కారు దింపేసి వదిలి వెళ్లాడన్నారు. రెండు గంటలపాటు నడిచి ప్రధాన రహదారికి చేరుకున్నారన్నారు. ఇంత జరిగితే.. కిడ్నాప్‌లో ఇంకేమైనా కోణం ఉందా అంటూ మీడియాలో వస్తున్న కథనాలు చాలా బాధాకరమన్నారు.

నిందితుడు క్రిమినల్ బ్రేక్ గ్రౌండ్ గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు. కిడ్నాపర్ హేమంత్ గతంలో రెండు కిడ్నాప్‌లు చేసిన నేర చరిత్ర ఉందన్నారు. ఒక మర్డర్, ఒక రేప్ కేసుతో పాటు 12 కేసులున్నాయన్నారు. ఏ2 నిందితుడు రాజేష్ 45 కేసులు ఉన్నాయని ఉన్నాయన్నారు. వీరిద్దరు పక్కా ప్రణాళికతో డబ్బుకోసమే ఇదంతా చేశారన్నారు. వీళ్లిద్దరు జైలులో ఉన్నప్పుడే ఎవరైనా పెద్ద వ్యక్తిని టార్గెట్ చేయాలని, ఎక్కువ మొత్తంలో నగదు వసూలు చేయాలనే పథకం రచించారనే విషయాన్ని పోలీసుల వద్ద ఒప్పుకున్నారన్నారు. ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఇద్దరే ఉన్నారనే విషయం తెలుసుకొని దుండగులు ఇంట్లోకి ప్రవేశించారని సత్యనారాయణ తెలిపారు.

నిందితుడితో ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేవు

హేమంత్ అనే వ్యక్తితో గత ఐదేళ్ల కాలంలో ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేవని ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ అన్నారు. తన ఫోన్ రికార్డులను పరిశీలించుకోవచ్చన్నారు. ఒక వ్యాపారిగా రోజూ తనను ఎంతో మంది కలుస్తుంటారని, దానిలో భాగంగా కనిపించడకుండా ఎంతో మంది పని చేస్తుంటారన్నారు. నిందితుడు హేమంత్ అనే వ్యక్తితో ఎటువంటి ఫోన్లు, వాట్సప్ సందేశాలు ఎప్పుడూ చేయలేదన్నారు. ‘‘విశాఖ భద్రతపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. విశాఖలో భద్రత లేదంటూ కొందరు కొత్త పాట పాడుతున్నారు. ఎంపీ కుటుంబానికి సంబంధించి జరిగిన అంశాన్ని ప్రస్తావిస్తూ విశాఖలో భద్రత లేదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయని అది సరి కాదు. విశాఖ పోలీస్ లా అండ్ ఆర్ఢర్ వ్యవస్థ పనితీరు ప్రశంసనీయం. ఏ ప్రభుత్వంలోనైనా చెదురు మదురు సంఘటనలు సర్వసాధరణం. 2004లో నక్సల్స్ చంద్రబాబు నాయుడు కాన్వయినే పేల్చేసారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో అక్కడక్కడా చిన్న చిన్న సమస్యలు సర్వసాధరణం. మంచితో పాటు మత ఘర్షణలు వంటి చెడు జరిగింది.’’ అని అన్నారు.

పవన్ కల్యాణ్ చాలా బెటర్

తన కుటుంబంపై జరిగిన కిడ్నాప్ అంశంపై పవన్ కల్యాణ్ బాగానే మాట్లాడారని ఎంపీ సత్యనారాయణ అన్నారు. అదే తానైతే ఎన్ కౌంటర్ చేశా వాడినన్న పవన్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కష్టం ఎవరికొచ్చినా కష్టమేనన్నారు. ఏ పార్టీలో వ్యక్తులకు కష్టమొచ్చినా, కుటుంబాలు వేరు, రాజకీయాలు వేరని అన్నారు. తన కుటుంబం కిడ్నాప్ అంశంపై సీబీఐ విచారణకు సిద్ధమేనని ఎంపీ ఎంవీవీ స్పష్టం చేశారు.

Read more :

నా అభిమానులు నన్ను కూడా తిడుతున్నారు.. ఫ్యాన్స్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

పవన్ రాజకీయ వ్యవహారశైలిపై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story