Visakha: వర్షాలు లేక రైతుల ఆందోళన

by srinivas |
Visakha: వర్షాలు లేక రైతుల ఆందోళన
X

దిశ, గొలుగొండ: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా వర్షాలు జాడ లేకపోవడంతో దారగెడ్డ, బోరింగ్, బిడ్డేరు గెడ్డల దిగువన నాలుగు వేల ఎకరాల్లో వేసిన వరినాట్లు ఎండుముఖం పడుతున్నాయి. ఇప్పటి వరకు గెడ్డల నుంచి పారుతున్న సాగునీటితో కొంత వరకు కాపాడుకుంటూ వచ్చారు. పది రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో పాటు తీవ్ర ఎండలు కాయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఈ నెలలో భారీ వర్షాలు కురవడంతో ఇక్కడ పంటలకు ఇబ్బందులు ఉండేవి కావు. తాండవ జలాశయానికి ప్రధాన ఆధారమైన గెడ్డల నుంచి చుక్కనీరు ప్రవహించలేదు. భారీ వర్షాలు కురిస్తే తప్ప ఇటు గొలుగొండ మండలానికి అటు నాతవరం మండలానికి సాగునీరు అందే అవకాశం లేదని వాపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed