- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ మేనిఫెస్టోనే గెలిపించింది: వజ్జిపర్తి శ్రీనివాసరావు
దిశ, ఉత్తరాంధ్ర: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలపై కర్ణాటక ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఉంచారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అగ్రపధాన నిలిపారని ఏపీసీసీ అధికార ప్రతినిధి, విశాఖ తూర్పు నియోజక వర్గ పార్టీ ఇంఛార్జి వజ్జిపర్తి శ్రీనివాసరావు అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీపై పూర్తి నమ్మకం ఉంచారన్నారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టడానికి తోడ్పడిందన్నారు. జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజలు ఆయనతో నడిచారన్నారు. కర్ణాటక ప్రజలు భారతీయ జనతా పార్టీని పూర్తిగా తిరస్కరించారన్నారు. భావోద్వేగ పూరితమైన రాజకీయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు అనుకూలంగా ఉండరని కర్ణాటక ఎన్నికలు నిరూపించాయన్నారు. డబ్బు ప్రభావం కర్ణాటక ఎన్నికలలో పని చేయలేదన్నారు. కర్ణాటక ఎన్నికలు రానున్న మిగతా రాష్ట్రాలు ఎన్నికలపై కచ్చితంగా ప్రభావం చూపుతాయని వజ్జిపర్తి అన్నారు.
ఇవి కూడా చదవండి:
Congress: అత్యంత దయనీయ పరిస్థితుల్లో కాంగ్రెస్.. గెలుపు ఊసే లేదుగా..!