యువత ఉపాధి కోసమే రోజ్ గార్ మేలా: కేంద్రమంత్రి భగవత్ కిషన్

by srinivas |
యువత ఉపాధి కోసమే రోజ్ గార్ మేలా: కేంద్రమంత్రి భగవత్ కిషన్
X

దిశ, ఉత్తరాంధ్ర: యువత‌కు విస్తృతంగా ఉపాధి కల్పన కోసమే ప్రధాని మోదీ నాయకత్వంలో రోజ్ గార్ మేలా నిర్వహిస్తున్నారని కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి భగవత్ కిషన్ వెల్లడించారు. ఆయన విశాఖ విద్యుత్ నగర్‌లోని పోర్ట్ స్టేడియం‌లో ఐదవ రోజ్ గార్ మేలాను మంగళవారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మొత్తం 10 లక్షల మందికి ఉపాధి కల్పన ధ్యేయమన్నారు. ఇందులో భాగంగా ఈరోజు దేశ వ్యాప్తంగా 45 ప్రాంతాల్లో 71 వేల మందికి వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉపాధి నియామక పత్రాలు అంజేస్తున్నామని తెలిపారు. దేశం రక్షణ, వైద్య రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. యువత ఉజ్వల భారత్ సాకారం దిశగా అడుగులు వేస్తుందన్నారు. దేశంలో 39 కోట్ల మందికి ముద్ర పథకం రుణాలు మంజూరు చేశామని గుర్తు చేశారు.

అనంతరం ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచి ప్రసంగించారు. తరువాత అతిధుల చేతుల మీదుగా 400 మందికి ఉపాధి నియామక పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో తపాలా శాఖ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వీ. రాములు, కస్టమ్స్ చీఫ్ కమిషనర్ సంజయ్, డీఆర్ ఎం అనూప్ కుమార్ సత్పతి, జీఎస్ ఐ డిప్యూటీ డైరెక్టర్ గుప్తా, రైల్వే, పోర్ట్, బీఎస్ఎన్ఎల్, ఐఐఎం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed