జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

by Jakkula Mamatha |
జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం:జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, అన్ని రాజకీయ పార్టీలు పాత్రికేయుల సమస్యలను ఎన్నికల ప్రణాళికలో చేర్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో గురువారం జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. కోవిడ్ లో మరణించిన పాత్రికేయులకు ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా ఐదు లక్షల రూపాయల సాయాన్ని అందించాలని, పాత్రికేయులకు ఇళ్ల స్థలాలను నామమాత్రపు ధరలకు కేటాయించాలని, హర్యానా, కేరళ, గోవా రాష్ట్రాల్లో మాదిరిగా పాత్రికేయులకు పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని రౌండ్ టేబుల్ తీర్మానించింది.

కోవిడ్ తో మరణించిన దాదాపు 150 మంది జర్నలిస్టులకు రూ 5 లక్షలు చొప్పున పరిహారం చెల్లిస్తామని విడుదల చేసిన జీవో 3 సంవత్సరాలైనా అమలుకు నోచుకోలేదని తక్షణమే పరిహారం ఇవ్వాలని వక్తలు డిమాండు చేశారు.రాష్ట్రం లో జర్నలిస్టులపై పదేపదే తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్న నేపథ్యంలో గతంలో మాదిరిగా వాటి నివారణకు కమిటీలు వేయాలన్నారు. జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు తగిన వైద్య సదుపాయం పొందేందుకు వీలుగా రూపొందించబడ్డ వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ క్రింద చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తే వారికి కొంత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. సమాచార రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న స్థానిక పత్రికలకు తగిన సహకారం ప్రభుత్వం ఇవ్వాలన్నారు.

లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (ఎల్ఎన్ఏ)అధ్యక్షుడు పి. సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో CITU రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్. నర్సింగరావు ,సిపిఐ జిల్లా కార్యదర్శి పైడిరాజు, పి ఓ డబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి ,సిపిఎం నాయకులు కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యమ్. యుగంధర్ రెడ్డి, ఎన్ యుజేఐ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి నాగబోయిన నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు, ఐడిజెఎన్ రాష్ట్ర అధ్యక్షుడు టీ.నానాజీ, భారత్ బచావో ప్రతినిధులు ఎస్సార్ వేమన , శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుడు జే. వి .ప్రభాకర్, భీమ్సేనా వార్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి రాజేంద్రప్రసాద్, ఏపీజేయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట వేణు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి కె చంద్రమోహన్ జాప్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.ఎం. కీర్తన రావు పాల్గొని మాట్లాడారు.

Advertisement

Next Story

Most Viewed