- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP:ఆ ఓట్లలో మెజారిటీ ఓట్లు కూటమికే..గండి బాబ్జీ సంచలన వ్యాఖ్యలు
దిశ ప్రతినిధి,విశాఖపట్నం:ఈ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన 25 లక్షల మంది యువత తరలివచ్చి కూటమికి పెద్ద ఎత్తున ఓటు వేశారని విశాఖ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. విశాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవడంతో ప్రజల విసిగి పోయారన్నారు. ఉత్తరాంధ్ర వనరుల ఇసుక మైన్స్ ల్యాండ్స్ పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని ఆరోపించారు. విజయ సాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఎంవీవీ సత్యనారాయణ, జీ వెంకటేశ్వరరావు (జీవీ) తదితరులంతా ముఠాగా ఏర్పడి వేల కోట్ల రూపాయల ప్రభుత్వ, ప్రజల ఆస్తులు దోచేశారని ఆరోపించారు. దసపల్లా, సీబీసీ ఎన్ సీ, హయగ్రీవ, ఎన్‌సీసీ, రేడియండ్ వంటి వేల కోట్ల రూపాయల విలువైన స్థలాలు వారి చేతుల్లోకి వచ్చాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఓటింగ్ ప్రకారం తెలుగుదేశం మంచి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ కొంప సత్య నారాయణ, తెలుగుదేశం పార్టీ విశాఖ మీడియా కోఆర్డినేటర్ గోపాల రెడ్డి పాల్గొన్నారు.