- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రోజా నిర్వాకం గూగుల్ మర్చిపోదు: Vangalapudi Anita
దిశ, విశాఖపట్నం: రాష్ట్రంలో నాలుగు రోజులుగా జరిగిన ఘటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత అన్నారు. విశాఖలో మాట్లాడుతూ మంత్రి రోజాపై మండిపడ్డారు. బండారు అరెస్టు విషయంలో హై డ్రామా నడిచిందన్నారు. అసలు నాయకుల గురించి అసహ్యంగా మాట్లాడిన మొదటి వ్యక్తి మంత్రి రోజానే అని అనిత విమర్శించారు. ‘నాతో పాటు పీతల సుజాతను అసెంబ్లీలో బాడీ షేమింగ్ చేస్తే మీకు మేము స్త్రీలు అన్న విషయం గుర్తులేదా?. పవన్ కళ్యాణ్ భార్య గురుంచి మాట్లాడింది ఎవరు. చెంగల వెంకట్రావ్, రోజా వైస్సార్సీపీ కండువా వేసుకొని నా గురించి పిడిఎఫ్‌లు తయారు చేసి విడుదల చేసింది ఎవరు. చంద్రబాబు భార్యని దారుణంగా విమర్శిస్తే అప్పుడు రోజా హేళనగా ప్రవర్తించలేదా?. భువనేశ్వరిపై మీ నాయకులు తప్పుగా మాట్లాడితే ఎందుకు స్పందించలేదు. నువ్వు ఎవరినైనా నీ నోటికి వచ్చినట్లు మాట్లాడచ్చు కానీ నిన్ను ఎవరు అనకూడదా?. మహిళా కమిషన్‌కి కూడా రోజా వైస్సార్సీపీ మహిళలే తప్ప మిగతా పార్టీల వాళ్ళు మహిళలు కాదా.?. లక్ష మందికి పైగా మహిళల పైగా అఘాయిత్యాలు జరుగుతుంటే మహిళా కమిషన్ ఎక్కడుంది. కల్తీ మద్యం వల్ల ఎంతమంది మహిళల జీవితాలు నాశనమైపోతున్నాయో తెలుసా మీకు. కల్తీ మద్యం వల్ల ఎంతమంది ప్రజలు ప్రాణాలు పోతున్నాయో విశాఖ కేజీహెచ్‌కు వస్తే చూపిస్తా. ఆరోగ్య శాఖ మంత్రి కూడా మహిళ అయినా మద్యంపై మాట్లాడకపోవడం విచారకరం.’ అని వంగళపూడి అనిత మండిపడ్డారు.