- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ ఓటమి ఖాయం: గంటా శ్రీనివాసరావు
దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు అరెస్ట్, ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ విశాఖలోని ఆయన చేపట్టిన నల్ల బెలూన్లు ఎగురవేత కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. దీంతో గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ముఖ్యమంత్రులు పర్యటనకు వస్తే వినతి పత్రాలు తీసుకునే ఆనవాయితీ ఉండేదన్నారు. కానీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో అలాంటివేమీ లేవని మండిపడ్డారు. అంతేకాదు ఎక్కడ ముఖ్యమంత్రిని నిలదీస్తారోమోనన్న భయంతో అక్రమంగా నిర్బంధాలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కపట ప్రేమ చూపిస్తున్నారన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిని కలవడానికి లెటర్ ఇస్తే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ఇది నిరంకుశ పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట వస్తుందనే నమ్మకం తమకుందని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.