Breaking: విశాఖలో సుపారీ గ్యాంగ్ అరెస్ట్.. తుపాకులు, కత్తులు స్వాధీనం

by srinivas |   ( Updated:2023-05-31 11:00:01.0  )
Breaking: విశాఖలో సుపారీ గ్యాంగ్ అరెస్ట్.. తుపాకులు, కత్తులు స్వాధీనం
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో ఆరుగురు సుపారీ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా కొంతకాలంగా న్యూకాలనీ లక్ష్మీరాయల్ హోటల్‌లో ఉంటున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌లో తనిఖీలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా మహారాష్ట్రకు చెందిన వాళ్లుగా గుర్తించారు. వీరి నుంచి 2 తుపాకీలు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. సుపారీ ఒప్పందంలో భాగంగా నిందితులంతా విశాఖకు వచ్చినట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి పిలుపుతో సుపారీ సెటిల్‌మెంట్ల కోసం విశాఖలో మకాం వేసినట్లు సమాచారం. నిందితులంతా సుపారీ మాట్లాడుకుని మాటువేసి దారుణాలకు పాల్పడటం, అనంతరం పారిపోవడం లాంటివి చేస్తుంటారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు విచారణ చేపట్టారు. ‘సుపారీ ముఠా వెనుక ఉన్న వ్యక్తి ఎవరు.. ఏం చేసేందుకు విశాఖకు వచ్చారు. ఇప్పటివరకూ ఏం చేశారు..’ అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

Next Story