Visakha: పదవ తరగతి విద్యార్థులకు కరెంటు కష్టాలు

by srinivas |
Visakha: పదవ తరగతి విద్యార్థులకు కరెంటు కష్టాలు
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖపట్నంలో అనధికార విద్యుత్ కోతలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 6న కరెంట్ పోవడంతో అదే రోజు హిందీ పరీక్ష కావడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. శనివారం (ఈరోజు) ఉదయం 6 నుంచి 8 గంటల వరకు అనధికార పవర్ కట్ కావడంతో విద్యార్థులు చదువు కోలేక, నిద్ర కరువై ఇంగ్లీష్ పరీక్ష హాల్లో పలువురు విద్యార్థులు కునుకు పాట్లు తీశారు. వేసవి కావడంతో అనధికార పవర్ కట్‌ను నిలుపుదల చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాధేయపడుతున్నారు. ఎంవీపీ కాలనీ, జాలరి ఎండాడ, చిన్న వాల్తేర్ ఆర్టీసీ డిపో ఏరియా, ఎంవీపీ ఆర్టీసీ డిపో ఏరియా, కేడీపీఎం స్కూల్ పరిధి, బీచ్ రోడ్డు ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఏరియా ప్రాంతాల్లో అనధికార పవర్ కట్ కావడంతో ఈ ప్రాంత పదవ తరగతి విద్యార్థులు అవస్థలు పడ్డారు. పరీక్షలు అయ్యేవరకు పవర్ కట్ చేయవద్దంటూ జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Next Story