Vangalapudi anitha: మహిళలపై గౌరవం అంటే ఇదేనా..?

by srinivas |   ( Updated:2023-06-21 15:58:05.0  )
Vangalapudi anitha: మహిళలపై గౌరవం అంటే ఇదేనా..?
X

దిశ, ఉత్తరాంధ్ర: వైసీపీ ప్రభుత్వానికి మహిళలపై గౌరవం లేదని పొలిట్ బ్యూరో సభ్యురాలు రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై దాడులు ఘోరంగా జరుగుతున్నాయన్నారు. పది రోజుల్లో పది దారుణ సంఘటనలు జరిగాయన్నారు. ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ మాటలు దారుణంగా ఉన్నాయిని పేర్కొన్నారు. హత్యాచార సంఘటనను మార్గదర్శి ఖాతాదారులతో పోల్చడం దారుణంగా పేర్కొన్నారు. మైనర్ బాలిక కేక్ చాకలైట్ కోసం లొంగి పోతుందని మాట్లాడం నీచ సంస్కృతికి నిదర్శనమనన్నారు.

ఈ వైసీపీప్రభుత్వానికి ఆడపిల్లలు మీద ఇదేనా గౌరవం అని అనిత ప్రశ్నించారు. సంజయ్‌కి మైనర్ బాలికపై గౌరవం లేదని అన్నారు. హత్యాచార బాధితురాలితో పోల్చడం జుగుప్సాకరంగా ఉందని అన్నారు. ఇలాంటి అధికారులు ఉండటం వల్ల 52 వేలు దాడులు కాదని, 60 వేల దాడులు జరుగుతాయిని అన్నారు. ఏపీ సీఐడీ చీఫ్ ఆడపిల్లలు కోసం మాట్లాడితే ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ వాసి రెడ్డి పద్మ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఆమెకు సీఐడీ చీఫ్ మాటలు వినిపించలేదా, కనిపించలేదా ఐపీఎస్ సంజయ్‌కి ఐపీఎస్ సెక్షన్ మర్చిపోయి వైసీపీ సెక్షన్ గుర్తుకొచ్చాయని చెప్పారు. మహిళలకు సీఐడీ చీఫ్ సంజయ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని వంగలపూడి అనిత అన్నారు.

ఇవి కూడా చదవండి : వ్యవస్థలపై సునీత న్యాయపోరాటం!

Advertisement

Next Story