- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విశాఖ తీరంలో కబ్జాలు.. పట్టించుకోని అధికారులు
దిశ ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖ బీచ్ రోడ్‌లో కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జెడ్) నిబంధనలకు విరుద్ధంగా తిరిగి కట్టడాలు ప్రారంభమయ్యాయి. పలు కేసుల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు గతంలో కట్టడాలను కూల్చేయాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టి కొందరు రెవిన్యూ అధికారులు పరోక్షంగా సహకరింస్తుండటం వివాదాస్పదంగా మారింది. దీనిపై జనసేన స్పందిస్తూ వెంటనే బీచ్ లో కాంక్రీట్ నిర్మాణాలను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. విశాఖపట్నం చినగదిలి మండలం రుషికొండ గ్రామం సర్వే నెం:2/16లో ఐటీ సెజ్‌కు వెళ్లే జంక్షన్ వద్ద బీచ్ రహదారిలో కొందరు ప్రైవేటు వ్యక్తులు సీఆర్ జడ్ నోటిఫికేషన్ ప్రకారం జోన్-I, పరిధిలోకి వచ్చే ప్రాంతంలో నిర్మాణాలను ప్రారంభించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభివృద్ధి నిషేధ ప్రాంతంలోనికి వస్తున్న ప్రదేశంలో సహజసిద్ధంగా ఏర్పడి ఉన్న ఇసుక తిన్నెలపైన బండరాళ్లు , గ్రావెల్ వేసి ధ్వంసం చేస్తూ శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా కొందరు క్రింది స్థాయి రెవెన్యూ అధికారులు దగ్గర ఉండి మరీ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. సీఆర్‌జెడ్ నోటిఫికేషన్ ప్రకారం ఎనక్సర్ -3 లోకి వచ్చే ఈ ప్రాంతంలో అభివృద్ధి నిషేధించబడింది. ఇక్కడ ఎక్కడ శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలు చెయ్యకూడదు.
నిర్మాణాలు ఆపండి : జనసేన
సీఆర్‌జెడ్ పరిధిలోని సముద్ర తీరంలోని అభివృద్ధి నిషేధ ప్రాంతం జరుగుతున్న నిర్మాణాలను జనసేన నేత, పర్యావరణ వేత్త పీతల మూర్తి యాదవ్ ఆదివారం సందర్శించారు. ఇంత దారుణంగా సముద్రంలో కట్టడాలు ఏమిటని ప్రశ్నించారు. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం లేదా ప్రైవేటు వ్యక్తులైన ఏ విధమైన శాశ్వత కట్టడాలు గానీ లేక తాత్కాలిక కట్టడాలు గాని నిర్మిస్తున్నట్లయితే వాటికి సంబంధించిన పర్యావరణ శాఖల నుంచి ముందుగా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని మూర్తి యాదవ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డబ్ల్యూ.పి నెం. 110/2018 కేసులో ఈ విషయాన్ని స్పష్టం చేసిందని అధికారులు స్పందించాలని ఆయన కోరారు.
తీర ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లు
ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలో నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన హోటల్/రెస్టారెంట్ శాశ్వత కాంక్రీట్ వాణిజ్య సముదాయాల నిర్మాణాలు తొలగించాలని కోరారు. ఇవి పూర్తిగా పర్యావరణ చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డాయని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారని పేర్కొన్నారు. వీటిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.