అనకాపల్లి జిల్లాలో 300 కేజీల గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్ట్

by srinivas |   ( Updated:2024-07-27 17:05:51.0  )
అనకాపల్లి జిల్లాలో 300 కేజీల గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా లంకెలపాలెం వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానంగా తిరుగుతున్న కారును స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కారులో తరలిస్తున్న 150 డబ్బాల్లో ఉన్న 300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన సంతోష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పారిపోయారు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. గంజాయి ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారని, ఎవరికి సరఫరా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తామని తెలిపారు. విచారణ తర్వాత నిందితుడిని కోర్టులో ప్రవేశ పెడతామని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Next Story