Anakapalli: తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్: అయ్యన్నపాత్రుడు

by srinivas |   ( Updated:2023-05-25 15:59:21.0  )
Anakapalli: తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్: అయ్యన్నపాత్రుడు
X

దిశ, అనకాపల్లి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలు అనకాపల్లి పట్టణంలోని రింగ్ రోడ్ ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని సంక్షేమ పథకాలు రూపకల్పనకు ఎన్టీఆర్ మార్గదర్శకులని అన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవం చాటిచెప్పిన మహానేత అని కొనియాడారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అనకాపల్లి మాజీ శాసనసభ్యుడు,నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పీలా గోవింద్ సత్యనారాయణ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు బుద్ద నాగ జగదీష్, జిల్లాల్లోని నియోజకవర్గ ఇంచార్జిలు, ఎమ్మెల్సీలు, జిల్లాల్లోని ఇతర ముఖ్య నాయకులు,పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: Chandrababu: ప్రధాని మోదీకి, కేంద్రప్రభుత్వానికి శుభాకాంక్షలు

Advertisement

Next Story