Visakha: చిన్నారి ప్రాణం తీసిన మటన్... మరో తొమ్మిది మందికి అస్వస్థత

by srinivas |   ( Updated:2023-03-15 14:51:48.0  )
Visakha: చిన్నారి ప్రాణం తీసిన మటన్... మరో తొమ్మిది మందికి అస్వస్థత
X

దిశ, డైనమిక్ బ్యూరో: మటన్ ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. కుటుంబం అంతా కలిసి మటన్ వండుకుని తిన్నారు. కడుపు నిండా అన్నం తిని గంట కాకముందే కుటుంబం అంతా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదేళ్ల చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నేల పంచాయతీ తడక గ్రామంలో జరిగింది.

అర్ధరాత్రి తర్వాత ఒక్కొక్కరిగా..

ఓ కుటుంబం మంగళవారం రాత్రి మటన్‌ వండుకుని తిన్నారు. అంతా భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. అయితే అర్థరాత్రి తర్వాత ఒకరి తర్వాత ఒకరు మెుత్తం తొమ్మిది మంది వాంతులు వీరేచనాలతో బాధపడ్డారు. దీంతో స్థానికులు ఇతర కుటుంబ సభ్యులు స్థానిక ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారి మీనాక్షి (5) చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగిలినవారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అయితే మెరుగైన చికిత్స నిమిత్తం వారిని విశాఖపట్నం తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఫుడ్ పాయిజన్ అయ్యిందని, అందువల్లే వాంతులు, వీరేచనాలతో బాధపడ్డారని వైద్యులు తెలిపారు.

Advertisement

Next Story