visakha: ఎమ్మెల్సీ ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఎంపీ అనుచరుడు

by srinivas |
visakha: ఎమ్మెల్సీ ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఎంపీ అనుచరుడు
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ 16వ వార్డు బూత్ నెం.232‌లో వైసీపీకి చెందిన వ్యక్తి డబ్బులు పంచుతుండగా స్థానికులు పట్టుకున్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న సుధాకర్‌ను గెలిచిపించాలని ఎంపీ అనుచరుడు ఈశ్వర్ రావు‌ డబ్బులు పంచుతున్నారు. లక్షల రూపాయలు జేబులో పెట్టుకుని ఓటర్లకు పంచేందుకు ప్రయత్నించారు. దీంతో ఈశ్వర్ రావు‌ను స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై స్థానికులతో పాటు టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఈశ్వర్ రావు ఎంపీ నిర్మాణ సంస్థలో ఉద్యోగిగా పని చేస్తున్నట్లు గుర్తించారు.

Advertisement

Next Story