- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Visakha: ఏపీ మెడ్ టెక్ జోన్‌ను సందర్శించిన మంత్రి శ్రీనివాస్
by srinivas |
X
దిశ, విశాఖ: విశాఖ స్టీల్ సిటీ పరిధిలో ఉన్న ఏపీ మెడ్ టెక్ జోన్‌ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం సందర్శించారు. అక్కడ వివిధ కంపెనీల ఆపరేషన్స్ ప్రక్రియలను పరిశీలించారు. వైద్య పరికరాల తయారీకి సంబంధించిన వివిధ కంపెనీలను సందర్శించిన ఆయన వివిధ కంపెనీల సీఈవోలతో ఆత్మీయంగా భేటీ అయ్యారు. అక్కడున్న వసతులు, కంపెనీలు, ఉద్యోగులు ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు, మెడ్ టెక్ జోన్ ప్రతినిధులు అక్కడున్న వివిధ కంపెనీలను చూపించారు. వాటి ద్వారా ఉత్పత్తయ్యే పరికరాలు, మార్కెటింగ్ ట్రెండ్ ఇతర అంశాల గురించి వివరించారు. ఆయన వెంట పలు కంపెనీల సీఈవోలు, విశాఖపట్టణం, అనకాపల్లి జిల్లాల పరిశ్రమల శాఖ అధికారులు గణపతి, శ్రీధర్ ఉన్నారు.
Advertisement
Next Story