- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
visakha Capital: పవన్ కల్యాణ్‌కు మంత్రి రోజా మరోసారి స్ట్రాంగ్ కౌంటర్
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు చేపట్టిన పుంగనూరు టూర్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్కడ తలెత్తిన ఘటనలు వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. ఇప్పుడు వైసీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇందుకు కారణం పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనే.
శుక్రవారం విశాఖలో పర్యటించిన పవన్ కల్యాణ్ రుషికొండ వద్ద జరుగుతున్న నిర్మాణాలపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. విమర్శల దాడికి దిగారు. తాజాగా పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా విమర్శలు చేశారు. రుషికొండపై పవన్ కల్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ పవర్ స్టార్ కాదని.. రీమేక్ స్టార్ అని బ్రో సినిమాను ఉద్దేశించి ఆమె విమర్శలు చేశారు. విశాఖను పాలనారాజధానిగా ఎంచుకున్నందుకే పవన్ కల్యాణ్, చంద్రబాబు విషం కక్కు తున్నారని రోజా ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూముల్లో భవనాలు నిర్మిస్తుంటే పవన్‌కు ఎందుకు బాధ కలుగుతుందని ప్రశ్నించారు. కొండలపై భవనాలు కట్టకూడదనడం పవన్ అజ్ఞానమని రోజా విమర్శించారు.
టీడీపీ నాయకులే విశాఖను దోచుకున్నారని రోజా ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పవన్ కల్యాణ్ తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కోర్టు నిబంధనల మేరకే రుషికొండ వద్ద నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. కోర్టుల కంటే పవన్‌కు ఎక్కువ తెలుసా అని రోజా ప్రశ్నించారు.