- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Visakha Global Investor Summit: 14 కీలక రంగాల్లో పెట్టుబడులు
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం వేదికగా నిర్వహించబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా రూ.2లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, తద్వారా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. విశాఖలోని జీఐఎస్ వేదిక వద్ద అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ శుక్రవారం ప్రారంభం కాబోతుందని..ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్ల పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే Advantage.ap.in లో 14 వేల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని తెలిపారు. సమ్మిట్‌కు వచ్చే డెలిగేట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఒకరోజు ముందుగానే రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టడం జరిగిందన్నారు. శుక్రవారం ఉదయం 10.15 గంటలకు సీఎం జగన్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సును లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు.
సమ్మిట్‌కు అంబాసిడర్స్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు
వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్స్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నట్లు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాబోయే ప్రముఖుల అందరి సమక్షంలో ఇనాగురల్ సెషన్ శుక్రవారం మధ్యాహ్నాం 2 గంటలకు ఉంటుందని అలాగే కొన్ని ఎంవోయూలు చేయడానికి నిర్ణయించకున్నట్లు తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 150 పై చిలుకు స్టాల్స్‌కు సంబంధించిన ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తోపాటుగా సీఎం జగన్ ప్రారంభిస్తారని తెలిపారు. ఎంపిక చేసిన 14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి సెక్టరల్ సెషన్స్ కూడా జరగనున్నాయిని వివరించారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలతో సీఎం జగన్ వారితో బ్యాక్ టూ బ్యాక్ మీటింగ్‌లో పాల్గొంటారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
పెట్టుబడుల ద్వారా అధిక ఉద్యోగాల కల్పనే లక్ష్యం
సీఎం జగన్ అంటే క్రెడిబిలిటీ. వారి నాయకత్వం పెట్టుబడిదారులకు సహకరిస్తుంది అనే నమ్మకాన్ని రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలకి కల్పించామని.. అదే నమ్మకాన్ని గ్లోబల్ పారిశ్రామిక వేత్తలకు కల్పించనున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాష్ట్ర ఎకానమీని అభివృద్ది చేయడం, అంతేకాకుండా యువతకు ఉపాధి కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని చెప్పుకొచ్చారు. ఈ సమ్మిట్‌కు 46 దేశాల ప్రముఖులు హాజరవుతారని అలాగే 8 నుంచి 10 మంది అంబాసిడర్స్ కూడా వస్తున్నారని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు. డెలిగేట్స్‌కు ఆంధ్రా రుచులను పరిచయం చేయబోతున్నామని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు.
పెట్టుబడిదారులకు అన్ని రకాల సహరించడానికి సిద్ధం
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ల్యాండ్స్, అన్ని అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. చేసుకున్న ఎంవోయూలను వారు ఆరు నెలల్లో గ్రౌండ్ చేస్తే అదనంగా సాయం చేయమని సీఎం వైఎస్ జగన్ సూచించారని వెల్లడించారు. అలాగే ఇన్వెస్ట్ మెంట్లను బేస్ చేసుకొని కొన్ని ఇన్సెంటివ్‌లను క్రియేట్ చేసినట్లు తెలిపారు. ఈ సదస్సు వేదికగా మొత్తం రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిండమే సీఎం టార్గెట్‌గా పెట్టుకున్నారని తెలిపారు. భారీగా పెట్టుబడులు తెచ్చి, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమన్నారు. పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా ఉండేలా కొత్త ఇన్వెస్ట్మెంట్ పాలసీని తీసుకువస్తున్నామని.. అలాగే ఎన్నికల కోడ్ సమస్య లేకపోతే ఇండస్ట్రియల్ పాలసీని శుక్రవారం ప్రకటిస్తామని లేని పక్షంలో 15 రోజుల తర్వాత దాన్ని ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. పెట్టుబడుల కోసం వచ్చే ప్రతి అవకాశాన్ని తాము క్షుణ్ణంగా సమీక్షిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చేసుకునే ఎంవోయూలలో 80 శాతం రియలైజ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు.