పవన్ చెబితే టీడీపీకి కాపులు ఓటేస్తారా : Minister Amarnath

by srinivas |   ( Updated:2023-09-16 16:52:02.0  )
పవన్ చెబితే టీడీపీకి కాపులు ఓటేస్తారా : Minister Amarnath
X

దిశ, విశాఖపట్నం: తప్పుచేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిప్పకూడు తింటున్న చంద్రబాబు అవినీతిపై చర్చకు రావాలని సీఎం జగన్‌ను లోకేష్ పిలవడం హాస్యాస్పదమని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. విశాఖ సర్క్యూట్ హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈడీ, ఐటీ, సీఐడీ అధికారులు విచారణకు రావాలని లోకేష్‌ను పిలుస్తుంటే, దానిపై ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. లోకేష్ తన స్థాయి, బతుకేంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. బాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లో యాక్షన్, రాజకీయాల్లో ఓవరాక్షన్ చేస్తున్నారని విమర్శించారు. కాపు నేత వంగవీటి రంగా హత్య, ముద్రగడ పద్మనాభంపై దాష్టీకానికి చంద్రబాబు నాయుడు బాధ్యుడని చెప్పారు. అలాంటి ఘటనలను పవన్ ఏప్పుడూ ఖండించలేదన్నారు. అలాంటి పవన్ చెబితే తెలుగుదేశానికి కాపు ప్రజలు ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. కాపు ఉద్యమానికి మద్దతు తెలపని పవన్ మాటలను ప్రజలు విశ్వసించరని అమర్నాథ్ అన్నారు.

Advertisement

Next Story