- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tanikella Bharani:తనికెళ్ల భరణికి జీవన సాఫల్య పురస్కారం
దిశ ప్రతినిధి, విశాఖపట్నం:రంగసాయి నాటక సంఘం 14 వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా వెండి తెరకే ఆభరణంగా వెలుగొందుతున్న రంగస్థల నటులు, రచయిత, దర్శకులు తనికెళ్ల భరణికి "రంగసాయి జీవన సాఫల్య పురస్కారాన్ని" అందజేయనున్నారు. ఆగస్టు 1న గురువారం సాయంత్రం 6 గంటలకు విశాఖ కళాభారతి ఆడిటోరియం జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారని నిర్వాహకులు బాదంగీర్ సాయి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రంగస్థల ప్రముఖులను మరో ఐదుగురిని ఎంపిక చేసి రంగ సాయి థియేటర్ అవార్డును ఈ సంవత్సరం నుండి ప్రవేశపెట్టామని తెలిపారు.
ఈ తొలి పురస్కారాలను ప్రముఖ దర్శకుడు ఎస్.ఎం. భాషా, యువ నటుడు వి. సతీష్ కుమార్, నాటక ప్రోత్సాహకులు పరిషత్తు నిర్వహకులు బుద్ధాల వెంకట రామారావు, పౌరాణిక రంగస్థల నటీమణి కె. మంగాదేవి, అతిపిన్న వయస్సు నుండి పౌరాణిక పాత్రలను ధరించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొంది ప్రభుత్వ నంది పురస్కారాన్ని అందుకున్న చిరంజీవి బగాది రితిష్ చంద్‌లకు ఈ అవార్డును ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే మరొక ప్రయోగంగా పది సంవత్సరాల లోపు బాల బాలికలచే "సంక్షిప్త భారతం" అను పౌరాణిక ఏకపాత్రల ఏకాంకికను ప్రదర్శింపజేస్తున్నామని తెలిపారు.