Indian Kapu Association: పవన్ కళ్యాణ్‌కు జడ్ ప్లస్ భద్రత కల్పించాలి

by srinivas |
Indian Kapu Association: పవన్ కళ్యాణ్‌కు జడ్ ప్లస్ భద్రత కల్పించాలి
X

దిశ. శృంగవరపుకోట: వైసీపీ నాయకుల నుంచి ప్రాణహాని ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ‌కు వెంటనే జడ్ ప్లస్ భద్రత కల్పించాలని ప్రధాని మోడీకి సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ విజయనగరం జిల్లా అధ్యక్షుడు వబ్బిన సన్యాసి నాయుడు లేఖ రాశారు. వైసీపీ నాయకులు సుపారి గ్యాంగ్‌లను ఏర్పాటు చేశారని పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని లేఖలో ఆయన ప్రస్తావించారు. వైసీపీ అధినేత జగన్ కుటుంబానికి 50 సంవత్సరాల నేర చరిత్ర ఉన్న విషయం వాస్తవమేనని, అధికారం కోసం ఏమి చేయడానికి అయినా వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే, ఎంపీ, ఐఏఎస్, ఐపీస్, జడ్జిలకు, మంత్రులకు కూడా రక్షణ లేదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు వైసీపీ పాలనలో రోజూ హత్యలు, మానభంగాలకు గురి అవుతున్నారని లేఖలో ప్రధానికి సన్యాసి నాయుడు వివరించారు. ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి వైసీపీ కార్యకర్తగా పని చేస్తున్నారని, ఆయనను పదవి నుండి తొలగించి రాష్ట్ర ప్రజలను రక్షించాలని సన్యాసి నాయుడు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed