- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home Minister:సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రి
దిశ ప్రతినిధి,విశాఖపట్నం:రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సింహాద్రి అప్పన్నకు మొక్కు తీర్చుకున్నారు. మెట్లెక్కి కొండకు వెళ్లి సింహాచలేశుని దర్శనం చేసుకున్నారు. తొలిపాంచా వద్ద ఆలయ అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. తొలిమెట్టు వద్ద అప్పన్న నమూనా విగ్రహానికి పూజలు చేసి టెంకాయ కొట్టి కుటుంబ సమేతంగా మంత్రి మెట్లెక్కారు. మధ్యలో ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని అర్చన చేయించుకున్నారు. అక్కడ నుండి మరికొన్ని మెట్లెక్కి ప్రకృతి జలధార చాకి ధార వద్ద తీర్థాన్ని ప్రోక్షణ చేసుకుని కొండకు చేరుకున్నారు.
ధ్వజస్తంభం వద్ద అర్చక పెద్దలతో కలిసి ఈఓ సంప్రదాయంగా స్వాగతం పలికారు. కప్ప స్తంభం ఆలింగనం చేసుకున్న మంత్రి మనసులోని కోరికలను స్వామివారికి నివేదించుకున్నారు. అంతరాలయంలో అర్చకులు మంత్రి పేరున అష్టోత్తర శతనామార్చన చేశారు. గోదాదేవి సన్నిధిలో మంగళహారతులు ఇచ్చారు. బేడా మండపంలో మంత్రిని ఆశీనులను చేసి నాదస్వర వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు ఆశీర్వాదం చేశారు. స్వామివారి చిత్రపటం, శేష వస్త్రాలు, ప్రసాదాలను ఈఓ మంత్రికి అందించారు.
ఈ సందర్భంగా మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలవేల్పు లక్ష్మీనరసింహస్వామి అని, మెట్ల మార్గంలో అప్పన్న స్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. గత ప్రభుత్వంలో సింహాచలం మెట్ల మార్గాన్ని నిర్లక్ష్యం చేసారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాధ్యత తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.