గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

by Jakkula Mamatha |   ( Updated:2024-03-17 14:50:53.0  )
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ -1 ప్రిలిమ్స్ ప‌రీక్షా కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ తనిఖీ చేశారు. ఆదివారం ఉదయం జిల్లాలో ప్రభుత్వ మహిళ కళాశాలలో గల కేంద్రాన్ని ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. పరీక్షా కేంద్రాన్ని సందర్శించి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు.పరీక్షా కేంద్రంలో తాగునీటి వసతి అందుబాటులో ఉందా లేదా అని గమనించారు. ఎగ్జామ్ హాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేనందున చాలా నిశితంగా పరిశీలించాలని పర్యవేక్షకులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో గదులను సందర్శిస్తూ, అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలను గమనించి ముఖ్య పర్యవేక్షకులకు పలు సూచనలు చేశారు.

Read More..

‘వాడుకుని వదిలేస్తోంది’.. ఇండియా కూటమిపై ప్రధాని మోడీ ఫైర్

Advertisement

Next Story