సైబర్ నేరాలపై అవగాహనకు గీతం విద్యార్థుల వాక్ థాన్

by Jakkula Mamatha |
సైబర్ నేరాలపై అవగాహనకు గీతం విద్యార్థుల వాక్ థాన్
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం:సైబర్ నేరాల పై ప్రజలకు అవగాహన కల్పించడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీర్స్ (ఐ.ఇ.టి.ఇ) విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆదివారం బీచ్ రోడ్ లో వాక్ థాన్ నిర్వహించారు. గీతం ఇ.ఇ.సి.ఇ. విభాగం అధిపతి ప్రొఫెసర్ భరణీ చంద్రకుమార్, ఐ.ఇ.టి.ఇ. విభాగం కన్వీనర్ బి.సెవెన్త్ లైన్ హజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైబర్ నేరాల్లో ప్రపంచంలో 80 వ స్థానంలో ఉన్నామని, ఏటా సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాలలో అపరిచిత వ్యక్తులతో పంచుకోవడం, ఆన్ లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ విభాగం సహాయం తీసుకోవాలని సూచించారు. సైబర్ సెక్యూరిటీ పై విద్యార్థులు పలు నినాదాలతో కూడిన బోర్డులను ప్రదర్శించారు. కార్యక్రమానికి విభాగం అధ్యాపకులు డాక్టర్ పి.రాజు, డాక్టర్. ఎస్.శారదా రాణి సంధాన కర్తలుగా వ్యవహరించారు.

Advertisement

Next Story

Most Viewed