VIMS : వైజాగ్ లో గంజాయి బ్యాచ్ హాల్ చల్

by M.Rajitha |
VIMS : వైజాగ్ లో గంజాయి బ్యాచ్ హాల్ చల్
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం(Vishakhapatnam)లో మంగళవారం గంజాయి బ్యాచ్ హాల్ చల్ చేసింది. నగరంలోని విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(VIMS) ఆసుపత్రిలో గంజాయి సేవించిన కొంతమంది ఆకతాయిలు రెచ్చిపోయారు. సెక్యూరిటీ గార్డ్స్ మీద, రోగులు, వారి బంధువుల ఎంఐఎస్ఏ దాడికి దిగారు. కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేని సామాన్య ప్రజలు నిత్యం వేలల్లో విమ్స్ కు వస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఈ ముఠా మద్యం సేవించి, గంజాయి తీసుకొని ఆసుపత్రికి వచ్చి పిచ్చివేషాలు వేస్తూ.. ఆసుపత్రి సిబ్బందితోపాటు రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నేడు కూడా ఓ ముఠా ఆసుపత్రి ప్రాంగణంలో వచ్చీ పోయే వారిని ఇబ్బందులకు గురి చేయగా.. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వద్దని వారించారు. దీంతో మరింత రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. విమ్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని, వారిని గాలించి పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.

Advertisement

Next Story

Most Viewed