Visakha: ప్రాణం ఉన్నంత వరకు వైసీపీతోనే: అవంతి శ్రీనివాస్

by srinivas |   ( Updated:2023-04-08 12:29:00.0  )
Visakha: ప్రాణం ఉన్నంత వరకు వైసీపీతోనే: అవంతి శ్రీనివాస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరతానంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, దాన్ని ఖండిస్తున్నట్లు అవంతి వెల్లడించారు. టీడీపీలో చేరడమే కాకుండా అనకాపల్లి నుంచి పోటీ చేస్తానని కూడా ప్రచారం చేసేస్తున్నారని,అందులో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు. మధురవాడలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ ప్రచారంపై అవంతి శ్రీనివాస్ మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులు మైండ్‌ గేమ్‌ రాజకీయాలకు పాల్పడుతూ ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షనేతలకు పుట్టగతులుండవని...మళ్ళీ వైఎస్ జగనే సీఎం కావడం తథ్యమని మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.

Advertisement

Next Story