CITU: ఏప్రిల్ 5న చలో ఢిల్లీ.. విజయవంతం చేయాలని విజ్ఞప్తి

by srinivas |   ( Updated:2023-03-19 13:40:34.0  )
CITU: ఏప్రిల్ 5న చలో ఢిల్లీ.. విజయవంతం చేయాలని విజ్ఞప్తి
X

దిశ, ఉత్తరాంధ్ర: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఆలోచనని బీజేపీ ప్రభుత్వం విరమించుకోవాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్‌వీ కుమార్ డిమాండ్ చేశారు. విశాఖ సీపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం తీరుకు నిరసనగా ఏప్రిల్ 5న చేపట్టబోయే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల జీవన శైలిని చిన్నాభిన్నం చేసే కార్మిక కోడ్లను బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

కొంతమంది ఎంపీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటులో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని లేవనెత్తుతారని.. దీనికి బదులుగా కేంద్రంలో మంత్రులు ప్రైవేటీకరణ తప్పదని అంటారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతుందన్నారు. డీజిల్ లోకో షెడ్ ప్రైవేటీకరణ, పోర్టు షిప్ యార్డ్‌లను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆరోపించారు. కార్మికులకు మేలు చేయకపోగా ఎవరిని ఉద్ధరించడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్‌వీ కుమార్ నిలదీశారు.

Advertisement

Next Story