Visakha: వచ్చే ఎన్నికలపై సంచలన విషయం చెప్పిన ఎంపీ జీవీఎల్

by srinivas |   ( Updated:2023-04-20 14:32:29.0  )
Visakha: వచ్చే ఎన్నికలపై సంచలన విషయం చెప్పిన ఎంపీ జీవీఎల్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీని గద్దె దించడమే బీజేపీ లక్ష్యమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. బీజేపీ, వైసీపీ రెండు ఒకటేనని.. ఆ రెండు పార్టీ మధ్య సంబంధాలున్నాయని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. బీజేపీ, వైసీపీ ఎలాంటి సంబంధాలు లేవని, ఓటమి భయంతోనే టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని జీవీఎల్ తెలిపారు. తాము ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్నామని తెలిపారు. తమ మధ్య చిచ్చు పెట్టెందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్ విషయంలో హడావుడి చేసిన బీఆర్ఎస్ పార్టీపైనా జీవీఎల్ విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అంటే భ్రమ రాజకీయ సమితి అని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ బిడ్‌లో బీఆర్ఎస్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ కొంటామని డ్రామాలు ఆడారని విమర్శించారు. ఏపీ ప్రజలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. నాలుగేళ్లలో విశాఖకు వైసీపీ నేతలు ఏం చేశారో చెప్పాలని జీవీఎల్ సవాల్ విసిరారు.

ఇవి కూడా చదవండి : Tirupati: నిరంతర రాజకీయ శ్రామికుడు!

Advertisement

Next Story