- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Visakha: ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వెనుక అసలు కథ ఇదే...!
దిశ, ఉత్తరాంధ్ర: విశాఖలో కొంత కాలంగా ఆకు రౌడీలు, వీధి గుండాలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఎంపీ భార్య జ్యోతి, కుమారుడు శరత్ చౌదరి, ఆడిటర్ జీవిని బంధించి రౌడీ షీటర్లు హింసించడం చాలా దారుణమన్నారు. భగవంతుడి దయవల్ల వారంతా క్షేమంగా బయటపడ్డారని..అయితే ఈ మొత్తం వ్యవహారంపై చాలా అనుమానాలున్నాయన్నారు. ఏపీ పోలీసులు నిస్పాక్షిక విచారణ జరుపుతారనే నమ్మకం లేదని, దీనిపై రాష్ట్ర పోలీసులతో కాకుండా థర్డ్ పార్టీతో ఎంక్వయిరీ వేయాలని, సీబీఐ లేదా ఎన్ఐఏతో విచారణ జరిపిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని డిమాండ్ చేశారు. దుండగులు గంజాయి తాగుతూ ఎంపీ కుటుంబీకులను శారీరకంగా, మానసికంగా హింసించడం దారుణమన్నారు.
ఈ ఘటన వెనక కడప, పులివెందుల బ్యాచ్‌లు ఉన్నాయనే ప్రచారం జరుగుతోందన్నారు. ఈ సంఘటనకు నాలుగు రోజుల ముందు నుంచి ఋషికొండ ప్రాంతంలో సెల్ ఫోన్ డేటా బయటకు తీస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుందన్నారు. రెండు రోజుల పాటు శరత్ చౌదరి ఇంట్లో దుండగులు తిష్ట వేయటం వెనుక చాలా అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కిడ్నాప్ జరిగితే బంధీలను తీసుకుని వెళతారని, కానీ ఇక్కడ అలా జరగలేదని తెలిపారు. ఏపీలో యూపీ మోడల్ పోలీసింగ్ అమలు చేస్తేనే రాష్ట్రంలో అరాచకాలు తగ్గుతాయని విష్ణుకుమార్ రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసులో కుట్ర దాగి ఉందనే అనుమానం బయట ప్రజల్లో కలుగుతోందన్నారు. విశాఖ ప్రజలతో పాటుగా, హై ప్రొఫైల్ వాళ్ళు కూడా భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. విశాఖలో అరాచక శక్తులు తిరుగుతున్నాయని స్వయంగా కేంద్ర హోం మంత్రి హెచ్చరించారన్నారు. గంజాయి మత్తులో జరిగిన అరాచకం గురించి తెలుసుకుని నివ్వెరపోవాలిసి వచ్చిందని, ఎంపీ ఫ్యామిలీకి ఇబ్బంది కలిగితే ప్రతిపక్ష పార్టీలు సంబరాలు చేసుకుంటున్నారని వైసీపీ నాయకులు దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది కిడ్నాప్ కాదు, సెటిల్ మెంట్ వ్యవహారం అనేది తమ అభిప్రాయమని స్పష్టం చేశారు. భూ దందాల్లో ఇచ్చుపుచ్చుకునే దగ్గర తేడాలా...? లేక ఇతర కారణాలా...? అనేది విచారించాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.