Breaking: అరకు ఇంచార్జి మళ్లీ మార్పు.. ఆ కీలక నేతకు బాధ్యతలు..!

by srinivas |
Breaking: అరకు ఇంచార్జి మళ్లీ మార్పు.. ఆ కీలక నేతకు బాధ్యతలు..!
X

దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలవాలనే ఆలోచనతో ఆయా స్థానాలకు కొత్త ఇంచార్జులను వైసీపీ అధిష్టానం నియమిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే నాలుగు విడుతల్లో మార్పులు, చేర్పులు చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లోనూ మార్పులు చేశారు. దీంతో అసంతృప్తి వ్యక్తమయింది. లోకల్ నేతలకు కాకుండా బయట వ్యక్తులకు బాధ్యతలు అప్పగించడంతో స్థానిక నేతల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. దీంతో పలు నియోజకర్గాల విషయంలో అధిష్టానం పునారాలోచనలో పడింది.

విశాఖ జిల్లా అరకు వైసీపీకి కంచుకోటగా ఉంది. ఆ నియోజకవర్గంలో పార్లమెంట్, లోక్‌సభ స్థానాలను వైసీపీనే గెలుచుకుంది. అయితే ఈ సారి ఎన్నికల్లో కూడా పట్టుకోవాలని భావించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి అరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్న గుడ్డేటి మాధవి పేరును అసెంబ్లీకి ప్రకటించారు. దీంతో ఈ నియోజకవర్గంలో అసంతృప్తి సెగలు విరుచుకుపడ్డాయి. నేతలు, కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అప్రమత్తమైన అధిష్టానం వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డిని అరకు నియోజకర్గానికి పంపి నేతల అభిప్రాయాన్ని స్వీకరించింది. అంతేకాదు అరకుకు కొత్త ఇంచార్జిని నియమించాలని నిర్ణయించింది. అందరి అభిప్రాయాల మేరకు జడ్పీటీసీగా రాగం మత్య్సలింగం పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాగం మత్స్యలింగం హుకుంపేట జడ్పీటీసీగా ఉన్నారు. త్వరలో అరకు సమన్వయకర్తగా రాగం మత్య్సలింగం పేరును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక గిరిజననాయకుడు, కొండ దొర సామాజిక వర్గం కావడంతో రాగం మత్య్సలింగం అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఖరు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Next Story