- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap Politics:విశాఖలో రౌడీయిజం సీఎం జగన్ చలువే..గండి బాబ్జీ
దిశ ప్రతినిధి,విశాఖపట్నం:విశాఖలో శాంతి భద్రతలకు విఘాతం జగన్ చలువే అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ ఒక ప్రకటనలో తెలియజేశారు.జగన్ రెడ్డి పరిపాలనలో ఏర్పడిన శాంతిభద్రతలపై స్పందిస్తూ సోమవారం పత్రిక ప్రకటన చేశారు.జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి సరఫరా, మొన్న విశాఖలో డ్రగ్స్ కలకలం తర్వాత గన్స్, నేడు కత్తులతో కొట్లాట ఇలా విశాఖపట్నం లో శాంతి భద్రతలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖపట్నం స్మార్ట్ సిటీ అని పేరు చెబుతున్నప్పటికీ గంజాయి సరఫరా డ్రగ్స్ దిగుమతులతో అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నంకు చెడ్డ పేరు తీసుకొచ్చిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందని ఎద్దెవా చేశారు.జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి విశాఖపట్నం రౌడీలు విజృంభించి శాంతి భద్రతలకు విఘాతం తెస్తున్నారని ఆరోపించారు.ఈ పరిస్థితి ఏర్పడడానికి జగన్ రెడ్డి చేతకాని పాలనే కారణమని అని బాబ్జీ పేర్కొన్నారు.
Read More..
ఇక నుంచి నా రాజకీయ పయనం అక్కడి నుంచే: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి