సంక్షేమం ఉచితం కాదు.. హక్కు: Budi Mutyalanaidu

by srinivas |
సంక్షేమం ఉచితం కాదు.. హక్కు: Budi Mutyalanaidu
X

దిశ, ఏపీ బ్యూరో: రెండు వేళ్లు చూపించే టీడీపీ నాయకులకు మూడు వేళ్లు చూపించి ఓడిపోయారని చెప్పండని, జగనన్న నెలకు 3 వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి సొంత కొడుకులా చూసుకుంటున్నాడని గుర్తు చేయండని ప్రజలకు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో వైసీపీ సామజిక సాధికార యాత్ర నిర్వహించారు. ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అమలు చేస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు. పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ కార్యక్రమాలు అందించడం ఒక్క జగన్‌కే సాధ్యమని కొనియాడారు. ముడు వంతుల్లో రెండు వంతులు బడుగు, బలహీన వర్గాలకు స్థానం కల్పించినట్లు తెలిపారు. అలీబాబా 40 దొంగలు హేళన చేశారని మండిపడ్డారు. నాడు - నేడు ద్వారా విద్యా వైద్య రంగంలో విప్లాత్మకమైన మార్పులు తీసుకువస్తుంటే బడుగు బలహీనర్గాలకు సీఎం జగన్ పాలనలో న్యాయం జరిగిందని బూడి ముత్యాలనాయుడు గుర్తుచేశారు.

మంత్రి అమర్ నాథ్ మాట్లాడుతూ కంటి ఆపరేషన్ కోసం చంద్రబాబుకు బెయిల్ ఇచ్చినట్లు ​ తెలిపారు. మళ్ళీ 28 రోజుల తర్వాత జైలుకు వెళ్లాల్సిందేనని చెప్పారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సీఎం జగన్‌ సింగిల్‌గానే పోటీ చేస్తారని, చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ వెయ్యి కోట్ల చేతి కర్ర రూపంలో దొరికాడని మంత్రి అమర్‌నాథ్ విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed