CM Jagan: మన్యం జిల్లాకు సీఎం జగన్.. షెడ్యూల్ ఇదే..!

by srinivas |   ( Updated:2023-06-27 16:00:50.0  )
CM Jagan: మన్యం జిల్లాకు సీఎం జగన్.. షెడ్యూల్ ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. అమ్మఒడి నాలుగో విడత నిధులను కురుపాంలో విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ పర్యటన కోసం సీఎం జగన్ బుధవారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం బయల్దేరి వెళ్తారు. అక్కడ నుంచి విశాఖకు చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో కురుపాం మండలం చినమేరంగికి చేరుకుంటున్నారు. అక్కడ నుంచి కురుపాం సభ వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ అమ్మఒడి నాలుగో విడత నిధులు విడుదల చేసిన అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు.

కాగా మన్యం జిల్లా ఏర్పాటు తర్వాత తొలిసారిగా సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు సీఎం సభను విజయవంతం చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీగా ప్రజలు, విద్యార్థులను సమీకరించనున్నారు. ఇందుకోసం 400 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అలాగే 1700 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story