- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖ జిల్లాలో దారుణం.. ప్రేమించలేదని యువతిపై ఐరన్ రాడ్డుతో దాడి
దిశ, వెబ్ డెస్క్: విశాఖలో దారుణం జరిగింది. పెడగంట్యాడ మండలం బీసీరోడ్‌లో ప్రేమించలేదని యువతిపై యువకుడు ఐరన్ రాడ్డుతో దాడి చేశారు. ఇంట్లో ఉన్న యువతిపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు యువతి నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు. కేసు నమోదు చేసి యువకుడి కోసం గాలిస్తున్నారు.
కాగా స్థానిక యువకుడు నీరజ్ శర్మ తనను ప్రేమించాలని బీసీరోడ్‌కు చెందిన యువతిని కొంతకాలంగా వేధిస్తున్నారు. యువతి నిరాకరించినా నీరజ్ వేధింపులు మరీ ఎక్కువ కావడంతో ప్రేమించడం కుదరదని చెప్పింది. కోపంతో రగిలిపోయిన నీరజ్ శర్మ.. ఐరన్ రాడ్డు తీసుకుని డైరెక్ట్‌గా యువతి ఇంటికే వెళ్లి దాడి చేశారు. అడ్డుకోబోయిన యువతి కుటుంబ సభ్యులపైనా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడు నీరజ్ శర్మను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.