Alluri: ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ఆకస్మిక మృతి

by srinivas |
Alluri: ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ఆకస్మిక మృతి
X

దిశ, కొయ్యూరు: అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పంచాయతీలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్-2గా విధులు నిర్వహిస్తున్న పొటుకూరి వెంకటలక్ష్మి ఆకస్మికంగా మృతి చెందారు. సోలాబు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందారు. వెంకటలక్ష్మి మృతికి ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది తీవ్ర సంతాపం తెలిపారు.

Advertisement

Next Story