Breaking: శ్వేతను వేధించలేదు.. సర్దుకోవాలని చెప్పా: భర్త మణికంఠ

by srinivas |   ( Updated:2023-04-26 11:33:51.0  )
Breaking: శ్వేతను వేధించలేదు.. సర్దుకోవాలని చెప్పా: భర్త మణికంఠ
X

దిశ, వెడ్ డెస్క్: విశాఖ వైఎంసీఏ సమీపంలోని బీచ్‌లో ఓ యువతి మృతదేహం కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి వైఎంసీఏ మూడో పట్టణ పోలీసులు యువతి మృతదేహాన్ని గుర్తించారు. బీచ్ ఒడ్డుకు కొట్టుకు వచ్చిన యువతి మృతదేహంపై కనీసం బట్టలు కూడా లేకపోవడం సంచలనంగా మారింది. తొలుత పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో యువతి మృతదేహం పెద గంట్యాడకు చెందిన శ్వేతగా పోలీసులు గుర్తించారు. మృతురాలు 5 నెలల గర్భవతి అని నిర్ధారించారు. మృతురాలు ఆత్మహత్యకు పాల్పడిందా..? లేకపోతే మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖ ఈస్ట్ ఏసీపీ స్పందన

అయితే ఈ కేసుపై విశాఖ ఈస్ట్ ఏసీపీ మీడియాతో మాట్లాడారు. మృతురాలు మృతదేహంపై ఎలాంటి గాయాలులేనట్లు ఆయన స్పష్టం చేశారు. సూసైడ్ నోట్‌పై న్యూపోర్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

శ్వేత భర్త ఏమన్నారంటే..

అటు మృతురాలు శ్వేత భర్త సైతం స్పందించారు. శ్వేతను తాను వేధించలేదని, ఆమెతో ఫోన్ మాట్లాడుతుండగా స్విచ్చాఫ్ అయినట్లు తెలిపారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తే సర్దుకోవాలని చెప్పినట్లు ఆయన తెలిపారు. కడుపులో ఉన్న బిడ్డకోసమైనా ఆలోచించాల్సిందని భర్త మణికంఠ పేర్కొన్నారు

Also Read...

Tragedy: 15 రోజుల్లో పెళ్లి.. అంతలోనే దుర్మరణం

Advertisement

Next Story