Ap News: బండారు సత్యనారాయణకు బెయిల్

by srinivas |   ( Updated:2023-10-03 17:00:35.0  )
Ap News: బండారు సత్యనారాయణకు బెయిల్
X
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి బెయిల్ మంజూరు అయింది. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే ఈ కేసులో బండారు సత్యనారాయణకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపున కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రెండు కేసుల్లో 41ఏ నోటీసులు ఇచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాము నోటీసులు ఇవ్వలేదని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మసనం ఆదేశించింది. 25 వేల రూపాయల పూచీకత్తుతో బండారు సత్యనారాయణకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు.

ఇవి కూడా చదవండి : పాపం రోజా.. తీవ్ర కంటతడి

Advertisement

Next Story