- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం@1000రోజులు: నారా లోకేశ్ అభినందనలు
దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అని నినదిస్తూ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి కార్మిక శక్తి పిడికిలి బిగించి వెయ్య రోజులకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీకి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటానికి తెలుగుదేశం పార్టీ మద్దతు సంపూర్ణంగా ఉంటుంది అని లోకేశ్ ఈ మేరకు ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘పోరాట యోధులకు విశాఖ విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రజలు సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్.. జగన్ అనే అవినీతి నేర పాలకుడి వల్ల ప్రైవేటు పడుతోంది. స్టీల్‍ప్లాంట్ ప్రైవేటీకరణకి నిరసనగా పోరాట కమిటీ చేపట్టిన ఉద్యమానికి వెయ్యి రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా కార్మికులకి ఉద్యమాభివందనాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటానికి తెలుగుదేశం పార్టీ మద్దతు సంపూర్ణంగా ఉంటుంది’ అని నారా లోకేశ్ భరోసా ఇచ్చారు.