విశాఖలో భారీ వర్షం.. కూలిపోయే స్థితిలో కొండవాలు ప్రాంతం..!

by srinivas |
విశాఖలో భారీ వర్షం.. కూలిపోయే స్థితిలో కొండవాలు ప్రాంతం..!
X

దిశ, ప్రతినిధి, విశాఖపట్నం: ఎడతెరిపి లేని వర్షాలతో విశాఖ గజగజలాడుతోంది. నగరంలోని గెడ్డలన్నీ ఉధృతంగా ప్రవహిస్తుండటం కొండవాలు ప్రాంతాల్లో చర్యలు విరిగి పడుతుండటంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం గోపాలపట్నంలో కొండచరియలు విరిగిపడంతో స్థానికులు ఆందోళన చెందారు. దీంతో వీరిని పునరావాస శిబిరాలకు తరలించారు. గోపాలపట్నం రామకృష్ణనగర్ కాళీమాత గుడి దారిలో విరిగిపడ్డ కొండచరియలు ఆ ప్రాంతవాసులను కలవరపరిచాయి. కొండవాలు ప్రాంతాల్లో ఇళ్లకు ముప్పు పొంచి ఉన్న ముప్పు ఉండటంతో స్థానిక శాసనసభ్యుడు గణబాబు అధికారులతో కలిసి పర్యటించి ఇళ్లలో నుంచి జనాన్ని ఖాళీ చేయించారు. హనుమంత్వాక, ఎండాడ, తోటగురువు, మధురవాడ కొండవాలు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. జీవీఎంసీకి చెందిన ఉన్నతాధికారులతో పాటు రెండు వేల మంది సిబ్బంది విజయవాడ పునరావాస పనుల్లో ఉండటంతో ఇక్కడ సహాయ చర్యలకు సిబ్బంది కొరత ఏర్పడింది. కలెక్టరేట్‌తో పాటు పోలీస్ కమిషనరేట్లో కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటుచేసి ఎక్కడ ఏ ఇబ్బంది ఎదురైనా తెలియజేయాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed