- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: విశాఖ డ్రగ్స్ కేసు వయా కాకినాడ
దిశ, పిఠాపురం: ఏపీలో సంచలనం రేకేత్తించిన విశాఖలో పట్టుబడ్డ 25 వేల కిలోల డ్రగ్స్ కేసులో కాకినాడ జిల్లాకు సంబంధాలు ఉండటం కలకలంరేపుతోంది. కాకినాడ జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం మూలపేటలో సంధ్య ఆక్వా పరిశ్రమలోనూ సిబిఐ తనిఖీలు చేపట్టింది. ఈ నేపథ్యంలో గురువారం అర్థరాత్రి నుండి తనిఖీలు కొనసాగుతున్నాయి.
కాగా ఈ తనిఖీల్లో ఏడుగురు సిబిఐ అధికారుల బృందం పాల్గొంది. డ్రగ్స్ కేసుకు సంబంధించి పలు ప్రాంతాల్లో సిబిఐ వరుస దాడులు కొనసాగుతున్నాయి. సంధ్య ఆక్వా పేరుతో బ్రెజిల్ నుండి జర్మనీ మీదుగా డ్రగ్స్ భారీ ఎత్తున విశాఖకు ఈ నెల 16న చేరుకున్నాయి. దీనిపై ఇంటర్ పోల్ ఇచ్చిన సమాచారంతో సిబిఐ రంగంలోకి దిగింది.
సంధ్య ఆక్వా పరిశ్రమ పేరుతో బుక్ అయిన కంటైనర్లలో 25 కిలోల చొప్పున 1000 బ్యాగులలో డ్రగ్స్ ఉన్నట్టు సిబిఐ ఈనెల 19న విశాఖలో గుర్తించింది. దీంతో అప్రమత్తమైన సిబిఐ రాష్ట్ర వ్యాప్తంగా సంధ్య ఆక్వా పేరుతో ఉన్న ఒంగోలు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరితో పాటు కాకినాడ జిల్లా లోని మూలపేటలోను వరుస దాడులు కొనసాగిస్తోంది.
ఈనేపథ్యంలో కాకినాడ జిల్లా మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వాకు చేరుకున్న ఏడుగురు అధికారులు బృందం ఫ్యాక్టరీలో తనిఖీలు చేస్తోంది. ఆక్వా పరిశ్రమ కార్యకలాపాలు అక్కడ ఉన్న సరుకు వివరాలపై ఆరా తీస్తుంది. ఈ ఏడాది జనవరి 14న బ్రెజిల్ నుండి కంటైనర్ బయలుదేరి జర్మనీ మీదుగా విశాఖపట్నం నౌకాశ్రయానికి చేరుకున్నట్లు సిబిఐ చెబుతోంది.