- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Vishaka జిల్లాలో సైకిల్ దిగిపోనున్న కీలక నేత?
- పచ్చజెండా ఊపేసిన అభిమానులు
- టీ గ్లాస్ పడతారా.. ఫ్యాన్ కిందికెళతారా.. ?
దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ జిల్లాలో ఆయన రాజకీయ అడుగులు అనకాపల్లిలో మొదలెట్టారు. ఆ తరువాత చోడవరం , విశాఖపట్టణం, భీమిలి, మళ్లీ విశాఖపట్టణం. ఆయన ఎక్కడ అడుగు పెట్టినా ఆయన జైగంట మోగించడానికి అక్కడ జనం అభిమానులై వెంటపడుతుంటారు. ఓటమి చూడని ఆయనను చూసి ఏమాయ ఉందోనని జిల్లాలో అన్ని పార్టీల నేతలు ఈర్ష్య పడుతుంటారు. ఎందుకంటే ఆయన ఒక్కొక్క పార్టీ నుంచి ఇప్పటికే అన్నీ పార్టీల్లోకి మారుతూ వచ్చారు. రాజకీయాల్లో నాయకులకు గెలుపోటములు సహజం. కానీ పార్టీ ఏదైనా విజయాన్ని చేజిక్కించుకోవడం ఎలా అనేది ఆ నాయకుడిలో సులువైన విశేషం. రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా, ఓడినా ఏ ప్రభుత్వం నిలిచినా, కూలినా ఆయనకు ఏ మాత్రం సంబంధం లేదు. రాష్ట్రంలో ఏ పార్టీ ఏలుతున్నా.. ఆ నాయకుడు విజయాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతుంటారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఓటమి నీడ ఆయన కంటికి కాదు కదా.. కనీసం ఆయన కూలింగ్ గ్లాసును కూడా తాకలేకపోయింది. ఆయన మైండ్ ఎంత చురుకుగా పని చేస్తుందంటే, అదను చూసి పార్టీలను మార్చేస్తుంటారు. అందరు రాజకీయ నాయకులకు అక్షరాభ్యాసం అవసరం. కానీ ఈనాయకుడికి అలాంటివి ఏమీ లేవు. అవలీలగా కొట్టుకెలుపోతూ ఉంటారు. ఆ నాయకుడు ఎటు వెళ్లినా తామున్నామంటూ సేవకు సిద్ధమయ్యే అభిమానులు ఎక్కడికెళ్లినా ఉంటారు.
అయితే ఈ నాయకుడు విజయానికి ఎలా అడుగులు వేయాలి.. జనాకర్షణకు ఏం చేయాలి.. ఆయనకు తెలిసినంతగా మరెవరికి తెలీదు. వాస్తవానికి ఆయన ఈ జిల్లావాసి కాకపోయినా.. వ్యాపారరీత్యా ఆయన వెల్ సెటిల్డ్ అనే చెప్పాలి. రాజకీయ తొలినాళ్ల నుంచి ఇప్పటికి వెను తిరిగి చూసుకుంటే సుమారుగా 22 సంవత్సరాలు దాటింది ఆయన రాజకీయ ప్రయాణం. తొలి నాళ్ళలో రాజకీయాల్లోకి రావాలనే కుతుహలంతో ముందుగా ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరిపోవడానికి కులం కార్డు బాగానే కలిసొచ్చింది. వారసత్వ రాజకీయాలకు జనం చెక్ పెట్టారనే విషయాన్ని ఆయన ముందుగానే గ్రహించినట్టున్నారు. రాజకీయాలకు వారసుడిని కాస్త దూరంగానే ఉంచుతున్నారు.
గెలుపు గంట మోగిందిలా..?
1999లో రాజకీయాల్లో ప్రవేశించి తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందారు. 2004 ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికలకు ముందు పీఆర్పీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైనప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి మండలిలో మంత్రి అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన ఈయన ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మళ్ళీ మంత్రి పదవిని దక్కించుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో స్థానం సంపాదించారు.
2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరా పరాయజయం చెందినా ఆయన మాత్రం విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికలు దగ్గరపడుతుండడంతో సైకిల్ పరిస్థితిపై ఆయన అప్పుడే ఒక అంచనాకు వచ్చేసినట్టున్నారు. ఏసీలో కూర్చుని బోరు కొట్టిందేమో కాస్త ఫ్యాన్ గాలి పీల్చుకుందామని ఇప్పటికే ఆయన అనుచర, అభిమాన, కులస్థులతో చర్చించారట. తమరు ఎటు వెళితే అటే వస్తామని పచ్చ జెండా ఊపేసారట.
వ్యూహాత్మకంగా అడుగులు..
రాజకీయాల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. అజ్ణాత గురువు సలహా తప్పనిసరి అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఇంతటి చాకచక్యంగా వేస్తున్న ఆయన రాజకీయ అడుగులు ఆయనంత స్మార్ట్‌గానే ఉంటాయి. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి మొగ్గు చూపుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంక ఆయన లిస్టులో మిగిలింది బీజేపీ, జనసేన.. ఈ పార్టీలు 2030, 2035లో ఉపయోగపడతాయోమో చూడాలి మరి.
Read more: