ఆంధ్రాలో ఆగని ఎన్నికల కోడ్ ఉల్లంఘన..అధికార పార్టీ ప్రచారాల్లో వాలంటీర్లు

by Indraja |   ( Updated:2024-03-21 03:52:00.0  )
ఆంధ్రాలో ఆగని ఎన్నికల కోడ్ ఉల్లంఘన..అధికార పార్టీ ప్రచారాల్లో వాలంటీర్లు
X

దిశ, పుట్టపర్తి: ఎన్నికల అధికారులు కట్టిన చర్యలు తీసుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన మాత్రం ఆగడం లేదు. నిన్న ఎన్నికల కోడ్ నిబంధనలను ఉలంఘించి అధికార పార్టీ ప్రచారంలో పాల్గొన్న పదహారు మంది వాలంటీర్లను ఎంపీడీఓ అధికారులు సస్పెండ్ చేశారు. అయినా వాలంటీర్లు మాత్రం వెనకడుగు వెయ్యడంలేదు. ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ప్రచారాల్లో పాల్గొంటున్నారు.

తాజాగా శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం లో ఎమ్మెల్యే దుద్దుకుoట శ్రీధర్ రెడ్డి కొత్త చెరువులో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కొత్తచెరువు మేజర్ పంచాయతీ గోరంట్ల పల్లి వాలంటీర్లు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా పార్టీ ప్రచారంలో పాల్గొనడమే కాదు.. హద్దు మీరిమరి పార్టీ కార్యకర్తలతో పార్టీ నాయకులతో కలిసి డాన్సులు చేశారు.


శ్రీధర్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో స్టోర్ డీలర్లు, మద్యం దుకాణం షాపుల్లో పనిచేసే సిబ్బంది, గోరంట్ల పల్లి గ్రామానికి చెందిన వాలంటీర్ హర్షద్ , బీసీ కాలనీకి చెందిన సాయి ప్రకాష్ లు పాల్గొన్నారు. అలానే ఓబుల దేవి చెరువు మండలం టీకుంటపల్లి గ్రామానికి చెందిన వాలంటీర్ అదెప్ప , ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓ వైపు ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ఉలంఘనకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపుతున్న అధికారపార్టీ జడవం లేదు.. వాలంటీర్లు బెదరడం లేదు.



ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు వాపోతున్నారు. తక్షణమే ఎన్నికల కోడ్ ఉల్లంఘకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికలు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా బాథ్యతతో వ్యవహరించాల్సిన అధికారపార్టీనే బాధ్యతారాహిత్యంగా ఎన్నికల కోడ్ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఎంతవరకు సంజసం అని ప్రతిపక్షాలు నిలదీస్తున్న అధికార పార్టీ ఆగడాలు మాత్రం ఆగడం లేదని తెలుస్తోంది. మరి ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన వారిపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Read More..

నంద్యాలలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మధ్యే పోటీ

Advertisement

Next Story